టీ 20 చరిత్రలో రెండో క్రికెటర్‌గా.. | Brendon McCullum 2nd player in T20 history to breach 9000 run mark | Sakshi
Sakshi News home page

టీ 20 చరిత్రలో రెండో క్రికెటర్‌గా..

Apr 8 2018 10:27 PM | Updated on Apr 8 2018 10:27 PM

Brendon McCullum 2nd player in T20 history to breach 9000 run mark - Sakshi

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరపున ఆడుతున్న బ్రెండన్‌ మెకల్లమ్‌ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. టీ 20 చరిత్రలో తొమ్మిదివేల పరుగుల మార్కును చేరిన రెండో క్రికెటర్‌గా మెకల్లమ్‌ గుర్తింపు సాధించాడు. ఆదివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో మెకల్లమ్‌ 27 బంతుల్లో 43 పరుగులు సాధించాడు. ఫలితంగా 9,035 టీ 20 పరుగుల్ని సాధించి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌(11,068) తొలి స్థానంలో ఉన్నాడు.

కేకేఆర్‌తో మ్యాచ్‌కు ముందు 8,992 పరుగులతో ఉన్న మెకల్లమ్‌ తన సహజసిద్ధమైన ఆటతో చెలరేగిపోయాడు. మరో ఓపెనర్‌ డీకాక్‌(4) విఫలమైనప్పటికీ మెకల్లమ్‌ మాత్రం విజృంభించి ఆడాడు. న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుకు వీడ్కోలు చెప్పి చాలా కాలమే అయినప్పటికీ తనలో సత్తా తగ్గలేదని తాజా ఇన్నింగ్స్‌తో మరోసారి నిరూపించాడు మెకల్లమ్‌.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement