స్టార్ వింగర్ రోమియో ఫెర్నాండెజ్ బ్రెజిలియన్ క్లబ్ తరఫున ఆడనున్న తొలి భారత ఫుట్‌బాల్ ఆట గాడిగా నిలువనున్నాడు...
పణజి: స్టార్ వింగర్ రోమియో ఫెర్నాండెజ్ బ్రెజిలియన్ క్లబ్ తరఫున ఆడనున్న తొలి భారత ఫుట్‌బాల్ ఆట గాడిగా నిలువనున్నాడు. ప్రస్తుతం డెంపో ఆటగాడిగా ఉన్న తనులోన్ ఒప్పందం కింద బ్రెజిల్‌కు చెందిన అట్లెటికో పారానెన్స్‌కు ఏడాది కాలం ఆడనున్నాడు.ఈ విషయాన్ని డెంపో నిర్ధారించింది. 22 ఏళ్ల రోమియో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో ఎఫ్‌సీ గోవా తరఫున బరిలోకి దిగి మూడు గోల్స్ సాధించాడు. దక్షిణ బ్రెజిల్‌లో పారానెన్స్‌కు అతిపెద్ద క్లబ్‌గా పేరుంది.