డ్వేన్‌ బ్రేవో ఔట్‌

Bravo out.from CSK Against KIngs Punjab Match - Sakshi

చెన్నై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సీజన్‌ 12లో భాగంగా స్థానిక చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో కింగ్స్‌ పంజాబ్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో చెన్నై టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇప్పటివరకు ఇరు జట్లు తలో నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడేసి మ్యాచ్‌ల్లో గెలిచాయి. సొంత మైదానంలో జరిగే ఈ మ్యచ్‌లో సీఎస్‌కే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇరు జట్లు బలంగా ఉండటంతో మరోసారి ఆసక్తికర పోరు ఖాయంగా కనబడుతోంది.

కింగ్స్‌ పంజాబ్‌ తుది జట్టులో క్రిస్‌ గేల్‌ చోటు దక్కించుకున్నాడు. గత మ్యాచ్‌కు దూరమైన గేల్‌ను సీఎస్‌కేతో జరిగే మ్యాచ్‌లో చోటు కల్పించారు. మరొకవైపు ఆండ్రూ టై కూడా కింగ్స్‌ జట్టులో చోటు దక్కింది. ఇక తొడ కండరాల గాయంతో సీఎస్‌కే జట్టుకు ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో దూరమయ్యాడు. గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చిన మోహిత్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌లకు కూడా ఉద్వాసన పలికారు. వారి స్థానాల్లో స్కాట్‌​ కుగ్లీన్‌, హర్భజన్‌, డుప్లెసిస్‌లను తుది జట్టులోకి తీసుకున్నారు.

సీఎస్‌కే
ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌, స్కాట్‌ కుగ్లీన్‌, హర్భజన్‌ సింగ్‌, ఇమ్రాన్‌ తాహీర్‌

కింగ్స్‌ పంజాబ్‌
రవిచంద్రన్‌ అశ్విన్‌(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌, మయాంక్‌ అగర్వాల్‌, సర్పరాజ్‌ ఖాన్‌, డేవిడ్‌ మిల‍్లర్‌, మన్‌దీప్‌ సింగ్‌, స్యామ్‌ కరన్‌, ఆండ్రూ టై, మురుగన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top