జోష్నా ఓటమి  | Black Ball Open: Joshna defeat the match | Sakshi
Sakshi News home page

జోష్నా ఓటమి 

Mar 14 2019 12:55 AM | Updated on Mar 14 2019 12:55 AM

Black Ball Open: Joshna defeat the match - Sakshi

కైరో (ఈజిప్ట్‌): బ్లాక్‌ బాల్‌ స్క్వాష్‌ ఓపెన్‌ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్‌ జోష్నా చినప్ప పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 16వ ర్యాంకర్‌ జోష్నా 11–7, 10–12, 11–2, 5–11, 8–11తో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ జోలీ కింగ్‌ (న్యూజిలాండ్‌) చేతిలో పోరాడి ఓడిపోయింది. మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జోష్నా 11–4, 6–11, 14–12, 11–9తో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ సారా జేన్‌ పెర్రీ (ఇంగ్లండ్‌)పై నెగ్గింది.

తొలి రౌండ్‌లో ఎనిమిదిసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మలేసియా దిగ్గజం నికోల్‌ డేవిడ్‌ను ఓడించిన జోష్నా... ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనూ అదే జోరు కనబరిచింది. ముఖాముఖి రికార్డులో 2–3తో వెనుకబడిన జోష్నా ఏడేళ్ల తర్వాత సారా జేన్‌ పెర్రీపై మళ్లీ గెలిచింది. చివరిసారి 2012 చెన్నై ఓపెన్‌ ఫైనల్లో ఈ ఇంగ్లండ్‌ ప్లేయర్‌ను తొలిసారి ఓడించిన జోష్నా ఆ తర్వాత ఆమెతో తలపడిన మూడుసార్లూ ఓటమి చవిచూసింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement