breaking news
Black Balloon
-
Somu Veerraju: ప్రధాని పర్యటనలో భారీ కుట్ర
సాక్షి, అమరావతి: రాష్ట్ర పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి ఒకే హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రమాదకర నల్ల బెలూన్లు ఎగురవేయడం ద్వారా భారీ కుట్రకు పూనుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం విమానశ్రయం నుంచి భీమవరానికి బయలుదేరిన సమయంలో ఆ పార్టీ నేతలు ప్రమాదకర బెలూన్లు ఎగురవేయడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఘటన వెనుక సూత్రధారులు, పాత్రధారులను, కుట్ర అమలు చేసిన దుష్టశక్తులను వెంటనే గుర్తించాలని డిమాండ్ చేశారు. ఘటనపై కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయనున్నట్టు సోము వీర్రాజు తెలిపారు. చదవండి: (CM YS Jagan: తరతరాలకు స్ఫూర్తిదాత) -
జోష్నా ఓటమి
కైరో (ఈజిప్ట్): బ్లాక్ బాల్ స్క్వాష్ ఓపెన్ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ జోష్నా చినప్ప పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 16వ ర్యాంకర్ జోష్నా 11–7, 10–12, 11–2, 5–11, 8–11తో ప్రపంచ ఐదో ర్యాంకర్ జోలీ కింగ్ (న్యూజిలాండ్) చేతిలో పోరాడి ఓడిపోయింది. మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జోష్నా 11–4, 6–11, 14–12, 11–9తో ప్రపంచ ఆరో ర్యాంకర్ సారా జేన్ పెర్రీ (ఇంగ్లండ్)పై నెగ్గింది. తొలి రౌండ్లో ఎనిమిదిసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మలేసియా దిగ్గజం నికోల్ డేవిడ్‌ను ఓడించిన జోష్నా... ప్రిక్వార్టర్ ఫైనల్లోనూ అదే జోరు కనబరిచింది. ముఖాముఖి రికార్డులో 2–3తో వెనుకబడిన జోష్నా ఏడేళ్ల తర్వాత సారా జేన్ పెర్రీపై మళ్లీ గెలిచింది. చివరిసారి 2012 చెన్నై ఓపెన్ ఫైనల్లో ఈ ఇంగ్లండ్ ప్లేయర్‌ను తొలిసారి ఓడించిన జోష్నా ఆ తర్వాత ఆమెతో తలపడిన మూడుసార్లూ ఓటమి చవిచూసింది. -
నల్ల బెలూన్ ఎలా పగిలిందబ్బా..?!
సౌరశక్తి, ఉష్ణ సంగ్రహణం వంటి విషయాల గురించి మనం ఎన్నో విన్నాం. సూర్యుడి కిరణాలు ఎంతటి శక్తిమంతమైనవో, వాటిని సక్రమంగా వినియోగించుకుంటే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో తెలుసుకున్నాం. అలాగే ఉష్ణ గ్రాహకాలు, విసర్జకాలు.. వాటి రంగుల మతలబు వగైరా సంగతులూ చిన్ననాటి నుంచి వింటూనే ఉన్నాం. ఈ రెండిటి కలయికలోని ఓ చిట్టి ప్రయోగం మాత్రం చాలామందికి తెలిసుండదు. అతి తక్కువ ఖర్చుతో అబ్బురపరిచే ఈ 'సైన్స్ వండర్' మీకోసం..! కావాల్సివవి: రంగు లేని బెలూన్ (క్లియర్), నల్ల రంగు బెలూన్, భూతద్దం, సూర్యకాంత, పెద్దల పర్యవేక్షణ ఎలా చేయాలి..? తొలుత రెండు బెలూన్లను దగ్గరకు తీసుకుని ఒకదానిలోకి మరొకటి ఉండేలా చేయండి. రంగు లేని బెలూన్ బయట ఉండేలా, దాని లోపలి భాగంలో నల్ల రంగు బెలూన్ ఉండేలా జాగ్రత్త పడండి. ఈ రెండు బెలూన్ల మూతి భాగాలు తెరచి ఉంచి, తొలుత నల్ల బెలూన్‌లోకి కొద్ది పరిమాణంలో గాలి నింపండి. అనంతరం గాలి బయటకు పోకుండా దాని మూతిని దారంతో కట్టేయండి. ఇప్పడు బయట ఉన్న రంగులేని బెలూన్‌లోకి తగినంత పరిమాణంలో గాలి ఊదండి. దీని మూతిని కూడా దారంతో కట్టేయండి. ఇప్పుడు మీకు ఒకదానిలో ఒకటి దాగున్న బెలూన్లు దర్శనమిస్తాయి. బాహ్యంగా రంగులేని బెలూన్.., దాని లోపలి భాగంలో చిన్న సైజులోని నల్ల రంగు బెలూన్ కనిపిస్తాయి. సూర్యకాంతి ఉండే ప్రదేశంలోకి ఈ బెలూన్లను తీసుకెళ్లి, భూతద్దం సాయంతో సన్నని సూర్యకిరణాలు వాటిపై పడేలా చేయండి. ఏం జరుగుతుంది..? సూటిగా బెలూన్లను తాకిన వెచ్చని సూర్య కిరణాలు బయట ఉన్న రంగులేని బెలూన్ని కాకుండా.. లోపలి నల్ల రంగు బెలూన్ని పగిలేలా చేస్తాయి. దీంతో టప్‌మనే శబ్దంతో పాటు ముక్కలైన నల్ల బెలూన్ మనకు కనిపిస్తుంది. రంగు లేని బెలూన్ మాత్రం మునుపటిలాగే ఉంటుంది. ఎందుకిలా..? అసాధారణ రీతిలో అమర్చిన ఈ బెలూన్లలో తొలుత సూర్య కిరణాల వేడికి పగలాల్సింది బయట ఉన్న తెల్ల బెలూన్. అయితే, ఆశ్చర్యకరంగా లోపలి నల్ల బెలూన్ పగిలింది. దీనికి శాస్త్రీయ వివరణ ఉంది. మనం ముందు చెప్పుకున్నట్టుగా ఉష్ణ గ్రాహకం ఇక్కడ పనిచేసింది. రంగులేని బెలూన్ పారదర్శకంగా ఉంటుంది. ఇది తనలోకి చొచ్చుకుపోయే సూర్య కిరణాలను, కాంతిని అడ్డుకోదు. దీంతో కాంతి నేరుగా లోపలికి వెళ్లిపోయింది. అయితే, లోపలి నల్ల రంగు బెలూన్ ఈ కాంతిని అడ్డుకుంది. అంతేగాక, దాని నల్లని రంగు కారణంగా సూర్య కాంతిని శోషించుకుంది. దీంతో అందులోని ఉష్ణాన్ని సైతం బెలూన్ గ్రహించినట్టయింది. ఉష్ణం పెరుగుతున్న కొద్దీ బెలూన్లోని అణువుల మధ్య దూరం పెరగసాగింది. అణువుల బంధ విచ్ఛిత్తి కారణంగా నల్ల బెలూన్‌లో బంధించి ఉన్న గాలి ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. అంతే.. టప్మని శబ్దం చేస్తూ బెలూన్ పేలిపోయింది. అయితే, ఉష్ణాన్ని గ్రహించని కారణంగా బయట ఉన్న రంగులేని బెలూన్‌కు మాత్రం ఎటువంటి నష్టమూ వాటిల్లలేదు.