కివీస్‌ను ఆదుకున్న వాట్లింగ్, గ్రాండ్‌హోమ్‌ 

BJ Watling and Colin de Grandhomme hauled New Zealand - Sakshi

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు  

క్రైస్ట్‌చర్చ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న చివరిదైన రెండో టెస్టులో న్యూజిలాండ్‌ తడబడింది. శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. వాట్లింగ్‌ (77 బ్యాటింగ్‌; 10 ఫోర్లు, 1 సిక్స్‌), గ్రాండ్‌హోమ్‌ (72; 7 ఫోర్లు) రాణించారు. ఓ దశలో 36/5తో కష్టాల్లో పడ్డ కివీస్‌ను ఈ జోడీ ఆదుకుంది. వీరిద్దరు ఆరో వికెట్‌కు 142 పరుగులు జతచేయడంతో కోలుకోగలిగింది. ప్రస్తుతం చేతిలో 4 వికెట్లు ఉన్న న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 115 పరుగులు వెనుకబడి ఉంది.

వాట్లింగ్‌తో పాటు సౌథీ (13 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో బ్రాడ్‌ 4, అండర్సన్‌ 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 290/8తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇం గ్లండ్‌ మరో 17 పరుగులు జోడించి 307 వద్ద ఆలౌటైంది. బెయిర్‌స్టో (101; 11 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కివీస్‌ బౌలర్లలో సౌథీ 6, బౌల్ట్‌ 4 వికెట్లు పడగొట్టారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top