ఐపీఎల్ వేదికే అజెండా | BCCI Working Committee set to zero in on two prospective countries for IPL on Friday | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ వేదికే అజెండా

Feb 28 2014 1:12 AM | Updated on Sep 2 2017 4:10 AM

ఐపీఎల్ వేదికే అజెండా

ఐపీఎల్ వేదికే అజెండా

దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్-7ను ఎక్కడ నిర్వహించాలో నిర్ణయించడమే ప్రధాన అజెండాగా శుక్రవారం బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది.

 బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం నేడు
 భువనేశ్వర్: దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్-7ను ఎక్కడ నిర్వహించాలో నిర్ణయించడమే ప్రధాన అజెండాగా శుక్రవారం బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఎన్నికల కారణంగా ఐపీఎల్‌కు భద్రత కల్పించలేమని హోంశాఖ స్పష్టం చేయడంతో ప్రత్యామ్నాయ వేదికల్ని బోర్డు పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విదేశాల్లో టోర్నీ నిర్వహిస్తే తమకు నష్టం కలుగుతుందన్న ఫ్రాంచైజీల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోనున్నట్లు, అందుకోసం ప్రత్యామ్నాయ వేదికను నిర్ణయించినా ఎన్నికల తేదీలను ప్రకటించిన తర్వాతే తుదినిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, విదేశాల్లోనే నిర్వహించాల్సివస్తే దక్షిణాఫ్రికానే తొలి ప్రత్యామ్నాయంగా బీసీసీఐ పరిగణిస్తోంది.
 
  ఐపీఎల్-2ను నిర్వహించిన అనుభవం ఉండడం, అక్కడి సమయాలు కూడా భారత్‌లో టెలివిజన్ వీక్షకులకు అనుకూలమైనవి కావడంతో బోర్డు ఆ దిశగా మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అయితే యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బంగ్లాదేశ్‌లను కూడా ప్రత్యామ్నాయ వేదికలుగా భావిస్తున్నా.. యూఏఈలో బుకీలు, ఫిక్సింగ్ బెడద ఎక్కువగా ఉంటుందనే ఆందోళన ఉంది. మరోవైపు బీపీఎల్ సందర్భంగా ఫిక్సింగ్ చోటుచేసుకోవడం బంగ్లాదేశ్‌లోనూ టోర్నీ నిర్వహణ శ్రేయస్కరం కాదన్న అభిప్రాయం కలిగిస్తోంది.
 
 సహాయ కోచ్ ఆలోచన లేదు: బీసీసీఐ
 ముంబై: టీమిండియాకు సహాయ కోచ్‌ను నియమించే ఆలోచనేదీ లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. విదేశీ పర్యటనల్లో భారత బౌలర్ల వరుస వైఫల్యాల నేపథ్యంలో బౌలింగ్ కోచ్ జోయ్ డేవిస్‌ను తప్పించి అతని స్థానంలో స్వదేశీ సహాయ కోచ్‌ను నియమించనున్నట్లు, శుక్రవారం భువనేశ్వర్‌లో జరగనున్న బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ విషయం చర్చకు రానున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అటువంటి అజెండా ఏదీ లేదని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. టి20 ప్రపంచకప్ ముగిశాక కెప్టెన్ ధోని, కోచ్ ఫ్లెచర్‌లతో సమావేశం జరుగుతుందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement