గాంధీ-మండేలా సిరీస్! | BCCI, CSA planning Gandhi-Mandela series | Sakshi
Sakshi News home page

గాంధీ-మండేలా సిరీస్!

Jun 4 2015 12:00 AM | Updated on Sep 3 2017 3:10 AM

అంతా అనుకున్నట్లు జరిగితే మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ట్రోఫీని త్వరలోనే చూడొచ్చు. ఇకపై భారత్, దక్షిణాఫ్రికాల

 జొహన్నెస్‌బర్గ్: అంతా అనుకున్నట్లు జరిగితే మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ట్రోఫీని త్వరలోనే చూడొచ్చు. ఇకపై భారత్, దక్షిణాఫ్రికాల మధ్య సిరీస్‌కు ఈ మహాత్ముల పేర్లతో ట్రోఫీని ఏర్పాటు చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) భావిస్తున్నాయి. ఇందులో భాగంగా తొలుత దక్షిణాఫ్రికా జట్టు భారత్ వచ్చి నాలుగు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత 2018లో భారత జట్టు అక్కడికి వెళ్లి నాలుగు టెస్టులు ఆడుతుంది. ‘రెండు జట్ల మధ్య సిరీస్‌కు ఆ మహాత్ముల పేర్లతో ట్రోఫీ ఏర్పాటు చేయాలనే ఆలోచన భారత్ నుంచి వచ్చింది. మేం కూడా సంతోషంగా అంగీకరించాం. అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది’ అని సీఎస్‌ఏ సీఈ లోర్గాట్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement