వరల్డ్ కప్లో బంగ్లాకు మూడో స్థానం | bangladesh gets third place at under 19 world cup | Sakshi
Sakshi News home page

వరల్డ్ కప్లో బంగ్లాకు మూడో స్థానం

Feb 13 2016 4:23 PM | Updated on Sep 3 2017 5:34 PM

వరల్డ్ కప్లో బంగ్లాకు మూడో స్థానం

వరల్డ్ కప్లో బంగ్లాకు మూడో స్థానం

అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో మూడో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది.

ఫతుల్లా:అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో మూడో స్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. సెమీ ఫైనల్లో ఓటమి పాలైన ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్ లో బంగ్లా మూడు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుల బ్యాటింగ్ చేసి 48.5 ఓవర్లలో 214 పరుగులకు పరిమితమైంది. శ్రీలంక ఆటగాళ్లలో ఆశాలంకా(76)రాణించగా, వానిడు డిసిల్వా(30), సలిందూ పెరైరా(34) ఫర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లు వైఫల్యం చెందడంతో్ శ్రీలంక సాధారణ స్కోరునే నమోదు చేసింది.

అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ చివరి ఓవర్ లో విజయం సాధించింది.హసన్ మిరాజ్(53),హుస్సేన్ షాంటో(40)లు ఆకట్టుకోగా,జాకర్ అలీ(31నాటౌట్), జోయ్ రాజ్ షేక్(26)లు మోస్తరుగా రాణించడంతో బంగ్లా ఏడు వికెట్ల నష్టానికి ఇంకా మూడు బంతులుండగా గెలుపును సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement