ఆసీస్‌దే వన్డే సిరీస్ | Australia won the ODI series | Sakshi
Sakshi News home page

ఆసీస్‌దే వన్డే సిరీస్

Nov 24 2014 12:55 AM | Updated on Apr 4 2019 5:21 PM

ఆసీస్‌దే వన్డే సిరీస్ - Sakshi

ఆసీస్‌దే వన్డే సిరీస్

దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-1 తేడాతో గెలుచుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో ఆస్ట్రేలియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన 2 వికెట్ల తేడాతో నెగ్గింది.

చివరి మ్యాచ్‌లోనూ ఓడిన దక్షిణాఫ్రికా

 సిడ్నీ: దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-1 తేడాతో గెలుచుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన ఐదో వన్డేలో ఆస్ట్రేలియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన 2 వికెట్ల తేడాతో నెగ్గింది. 281 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు పదో ఓవర్‌లో వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించి టార్గెట్‌ను 275 పరుగులుగా నిర్దేశించారు.

షేన్ వాట్సన్ (93 బంతుల్లో 82; 7 ఫోర్లు; 2 సిక్సర్లు), ఓపెనర్ ఆరోన్ ఫించ్ (67 బంతుల్లో 76; 11 ఫోర్లు), స్టీవెన్ స్మిత్ (74 బంతుల్లో 67; 6 ఫోర్లు; 1 సిక్స్) జట్టును ఆదుకున్నారు. అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 280 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఓపెనర్ డికాక్ (123 బంతుల్లో 107; 14 ఫోర్లు) వన్డేల్లో ఆరో సెంచరీ సాధించాడు. బెహర్డిన్ ( 63; 7 ఫోర్లు; 2 సిక్సర్లు) రాణించాడు.
 
 వన్డేల్లో టాప్‌కు చేరిన ఆసీస్
 దుబాయ్: దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 4-1తో గెలుచుకోవడంతో ఆస్ట్రేలియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌కు చేరుకుంది. ప్రస్తుతం భారత్‌తో సమానంగా 117 పాయింట్లతో ఉన్నా... 0.2 దశాంశమానం తేడాతో ఆసీస్ ముందంజలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement