ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో రామకృష్ణాపురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ విజేతగా నిలిచింది. సైనిక్‌పురిలోని భవాన్స్ శ్రీరామ కృష్ణా విద్యాలయంలో శనివారం జరిగిన ఫైనల్లో 2-1 స్కోరుతో భవాన్స్ స్కూల్‌పై నెగ్గింది.
నేరేడ్‌మెట్, న్యూస్‌లైన్: ఇంటర్ స్కూల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో రామకృష్ణాపురం ఆర్మీ పబ్లిక్ స్కూల్ విజేతగా నిలిచింది. సైనిక్‌పురిలోని భవాన్స్ శ్రీరామ కృష్ణా విద్యాలయంలో శనివారం జరిగిన ఫైనల్లో 2-1 స్కోరుతో భవాన్స్ స్కూల్‌పై నెగ్గింది.
భారత జట్టు స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ముఖ్య అతిథిగా హాజరై విజేతకు మెమెంటోను అందించాడు. తాను ఇదే పాఠశాలలో చదువుకున్నానని, చదువుతో పాటు క్రీడలకు కూడా పాఠశాల యాజమాన్యం అధిక ప్రాధాన్యమివ్వడం వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నట్టు ఓజా చెప్పాడు.