దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్‌

3rd ODI: South Africa Trounce Bangladesh By 200 Runs, Win Series 3-0

3–0తో వన్డే సిరీస్‌ కైవసం

200 పరుగుల తేడాతో ఓడిన బంగ్లాదేశ్‌

ఈస్ట్‌ లండన్‌ (దక్షిణాఫ్రికా): సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 2–0తో గెలుచుకున్న దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను కూడా 3–0తో కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో సఫారీలు 200 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి జోరు ప్రదర్శించారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 369 పరుగులు చేసింది. కెప్టెన్‌ డు ప్లెసిస్‌ (91; 10ఫోర్లు, 1సిక్స్‌) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగగా, డికాక్‌ (73; 9 ఫోర్లు, 1 సిక్స్‌)... తొలి వన్డే ఆడిన మార్‌క్రమ్‌ (66; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు.

బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్‌ మిరాజ్, టస్కీన్‌ అహ్మద్‌ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం టాపార్డర్‌ విఫలమవడంతో బంగ్లాదేశ్‌ 40.4 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. షకీబుల్‌ హసన్‌ (63; 8 ఫోర్లు) అర్ధసెంచరీ చేయగా, షబ్బీర్‌ రహమాన్‌ (39) రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డేన్‌ పీటర్సన్‌ 3, ఇమ్రాన్‌ తాహిర్, మార్‌క్రమ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఈ రెండు జట్ల మధ్య ఈనెల 26 నుంచి రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ జరుగుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top