సినీ మహిళల కోసం అసోసియేషన్‌

South Indian Film Womens Assosiation For Women Protection - Sakshi

పెరంబూరు: సినీ మహిళా సంరక్షణ కోసం ఒక అసోసియేషన్‌ ప్రారంభం కానుంది. సౌత్‌ ఇండియన్‌ ఫిలిం ఉమెన్స్‌ అసోసియేషన్‌ పేరుతో మే ఒకటవ తేదీన ప్రారంభించనున్నట్లు వైశాలి సుబ్రమణియన్‌ గురువారం వెల్లడించారు. దీని గురించి ఆమె తెలుపుతూ సినీరంగంలో మహిళల సంక్షేమం కోసం ఈ అసోసియేషన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ అసోసియేషన్‌కు తాను అధ్యక్షురాలిగానూ, వీపీ.ఈశ్వరి కార్యదర్శకురాలుగానూ, ఎస్‌.మీనా మరుదాసి ఉపకార్యదర్శిగానూ, ఎం.గీత కోశాధికారిగానూ, ఎంజల్‌ సామ్‌రాజ్‌ ఉపాధ్యక్షురాలిగానూ బాధ్యతలు నిర్వమించనున్నట్లు తెలిపారు.

ఈ విషయం గురించి ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే. సెల్వమణికి తెలియజేయగా మంచి ప్రయత్నం అమలు ప్రారంభించండి అని ప్రోత్సహించారని చెప్పారు. అదే విధంగా దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, ఛాయాగ్రాహకుల సంఘం అధ్యక్షుడు పీసీ.శ్రీరామ్‌ తమ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారని తెలిపారు. మే ఒకటవ తేదీన జరగనున్న ఈ అసోసియేషన్‌ ఆవిర్భావ వేడుకకు చిత్రపరిశ్రమకు చెందిన 24 శాఖలకు చెందిన ప్రముఖులతో పాటు పీసీ.శ్రీరామ్, నటుడు సత్యరాజ్, నటి రోహిణి, రేవతి, సచ్చు, పుష్కర్‌గాయత్రి  విశ్చేయనున్నారని తెలిపారు. అదేవిధంగా తమ సౌత్‌ ఇండియన్‌ ఫిలిం ఉమెన్స్‌ అసోసియేషన్‌లో సినీపరిశ్రమకు చెందిన మహిళలందరూ సభ్యులుగా చేరాలని వైశాలి సుబ్రమణియన్‌ తెలిపారు.

Read latest South India News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top