నేనూ ప్రేమలో పడ్డా!

raiza wilson special interview - Sakshi

తమిళసినిమా: సినిమాకు మోడలింగ్‌ రంగం రాచ మార్గం అనే చెప్పాలి. నేరుగా సినీ రంగప్రవేశం చేయడానికి ముఖ్యంగా హీరోయిన్లకు కష్టతరమే. అదే మోడలింగ్‌ రంగం నుంచి హీరోయిన్‌గా అవకాశం పొందడం సులభతరంగా మారింది. అలా కథానాయకిగా తెరపై మెరవడానికి రెడీ అయిన మోడల్‌ రైజా. పూర్తి పేరు రైజా విల్సన్‌. బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో ద్వారా మరింత పాపులర్‌ అయిన ఆ బ్యూటీ తాజాగా ప్రముఖ సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా నిర్మాతగా మారి నిర్మిస్తున్న ప్యార్‌ ప్రేమ కాదల్‌ చిత్రంలో కథానాయకిగా నటిస్తోంది. ఆమెతో కలిసి మరో బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో ఫేమ్‌ హరీష్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా రైజా ఇచ్చిన ఇంటర్వ్యూ చూద్దాం.

ప్ర: బిగ్‌బాస్‌ గేమ్‌ షో అనుభవం గురించి?
జ: బిగ్‌బాస్‌ గేమ్‌ షో నన్ను చాలా మందికి పరిచయం చేయడం సంతోషాన్ని కలిగించింది.

ప్ర: మోడలింగ్‌ రంగం నుంచి వచ్చినట్లున్నారు?
జ: నేను ఆరేళ్లుగా మోడలింగ్‌ రంగంలో ఉన్నాను. నా సొంత ఊరు బెంగళూర్‌ అయినా, దక్షణాది ముఖ్య నగరాల్లో మోడలింగ్‌ చేశాను.బీకామ్‌ పూర్తి చేసి మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించాను.

ప్ర: సినిమాల్లో నటించడం గురించి?
జ:  నేనెప్పుడూ సినిమాల్లో నటించడానికి తొందర పడలేదు. యువన్‌శంకర్‌రాజా నిర్మిస్తున్న ప్యార్‌ ప్రేమ కాదల్‌ చిత్రంలో హరీష్‌కల్యాణ్‌కు జంటగా నటిస్తున్నాను. ఈ చిత్రం విడుదలనంతరం ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూసి తదుపరి చిత్రాలపై నా నిర్ణయం ఉంటుంది.

ప్ర: ఈ చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చింది?
జ:   నేనూ హరీష్‌కల్యాణ్‌ ఆడిషన్‌కు వెళ్లాం. ఎంపికవుతాననే నమ్మకం నాకుంది. మోడలింగ్‌ రంగంలో ఉండడం వల్ల ఎలా నటించాలన్నది కొంచెం తెలుసు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్‌ ఏర్పడింది. అదే నిజమైంది.

ప్ర: అంతకు ముందు వీఐపీ–2 చిత్రంలో నటించినట్లున్నారు?
జ:  నిజం చెప్పాలంటే అది మోడలింగ్‌ అసైన్‌మెంట్‌. కాజోల్‌తో కలిసి నటించాను. చిత్రం మొత్తం నిలబడే ఉంటాను. నాకు ఒక్క డైలాగ్‌ కూడా ఉండదు.అదో వినూత్న అనుభవం.

ప్ర:ఎన్ని యాడ్స్‌లో నటించి ఉంటారు?
జ:  సుమారు 500లకు పైగా చేసి ఉంటాను. 2011లో మిస్‌ ఇండియా అందాల పోటీల్లో పాల్గొన్నాను.ఆ తరువాతనే మోడలింగ్‌ రంగంలో అవకాశాలు వచ్చాయి.

ప్ర:తమిళంలో మీకు నచ్చిన హీరో?
జ:  నిజానికి నేను తమిళ చిత్రాలు ఎక్కువగా చూడను. ఇటీవల నేను చూసిన తమిళ చిత్రం విక్రమ్‌ వేదా.అందులో మాధవన్‌ నటన అదుర్స్‌. నా కళ్లు ఆయన్ని మాత్రమే చూశాయి. ఐలవ్యూ మాధవన్‌.

ప్ర: ప్రేమలో పడ్డారా?
జ: : కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రేమ పుట్టింది. సినిమాలు, షికార్లు కూడా చేశాం. అయితే ఆ ప్రేమ విఫలమైంది.

ప్ర:పెళ్లెప్పుడు చేసుకుంటారు?
జ:  కచ్చితంగా ప్రేమ వివాహాన్నే చేసుకుంటాను. అయితే అందుకు ఇంకా సమయం ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top