ఢిల్లీ ఆంటీ క్షమాపణలు చెప్పింది! | Woman Who Made Crass Remarks About Girl Dress Apologises on Social Media | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఆంటీ క్షమాపణలు చెప్పింది!

May 2 2019 5:33 PM | Updated on May 2 2019 5:33 PM

Woman Who Made Crass Remarks About Girl Dress Apologises on Social Media - Sakshi

ఇలాంటి దుస్తులు వేసుకున్న వీరిని అవకాశం వచ్చినప్పుడల్లా రేప్‌ చేయండి..

న్యూఢిల్లీ : ‘హలో గాయిస్‌.. అంతా మమ్మల్నే చూడాలనే ఉద్దేశంతో ఈ యువతులు అత్యంత పొట్టి (షార్ట్‌) దుస్తులు ధరించారు. నగ్నంగా కనిపించేందుకు, రేప్‌ చేయించుకునేందుకు ఈ లేడీస్‌.. షార్ట్‌ డ్రెస్సెస్‌ ధరిస్తున్నారు. ఇలాంటి దుస్తులు వేసుకున్న వీరిని అవకాశం వచ్చినప్పుడల్లా రేప్‌ చేయండి’ అంటూ హల్‌చల్‌ చేసిన ఢీల్లి ఆంటీ ఎట్ట​కేలకు తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరింది. తన వ్యాఖ్యలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని, చాలా తప్పుగా మాట్లాడనని తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా పేర్కొంది. అనంతరం ఆమె తన సోషల్‌మీడియా ఖాతాలన్నిటినీ తొలగించింది. 

ఢిల్లీలో కొందరు యువతులను ఉద్దేశించి ఓ మధ్యవయస్కురాలైన మహిళ.. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, హింసకు వారి వేషధారణే కారణమంటూ.. దేశంలో నెలకొన్న అత్యాచారాల సంస్కృతిని సమర్థించే కిరాతక మనస్తత్వానికి అద్దం పట్టేలా చేసిన వ్యాఖ్యలు.. సోషల్‌ మీడియాలోహల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని పదేపదే ఆ యువతులు కోరినా.. సదరు మహిళ పెద్దగా పట్టించుకోలేదు. సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం.. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కావడంతో ఆమె తన తప్పును తెలుసుకొని క్షమాపణలు కోరింది.

చదవండి: అవి ధరించిన వారిని రేప్‌ చేయండి: ఢిల్లీ ఆంటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement