
64 కళల్లో చోర కళ కూడా ఒకటి అన్నట్టు ..దొంగతనం చేయడం కూడా ఆర్టే అని నిరూపించాడో ఓ బిత్తిరి దొంగ. దొంగతనం చేయాలని ప్లాన్ వేసుకొని ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. రోడ్డుమీద ఒంటరిగా వెళుతున్న యువతి కనిపించడంతో తన ప్లాన్ అమలు చేయాలని ప్రయత్నించాడు. కానీ ప్లాన్ బెడిసి కొట్టి బిక్కమొహం వేశాడు. చివరికి తన సొమ్ము ఎవరైనా ఎత్తుకుపోతే ఎలా వుంటుందో అర్థమయ్యి .. పరుగందుకున్నాడు. కుక్కకాటుకు చెప్పు దెబ్బలా యువతి స్పందించిన తీరు సోషల్ మీడియాలో ప్రశంసలందుకుంటోంది.
ఇంతకీ ఏంజరిగిందంటే.. ఈ ఫన్నీ వీడియోను మీరే చూడండి..
Stupid robber 🤣🤣🤣😂😆🤦♂️🙈 pic.twitter.com/azP7JTBLZs
— Funnyman (@fun4laugh) September 18, 2019