నేను ధైర్యవంతురాలిని కదా.. కానీ ఏం లాభం!

Netizens Searching For Girl Who Wrote Love Letter On Flight Sick Bag - Sakshi

అసలే ఒంటరి ప్రయాణం బోర్‌ అనుకుంటే.. అందుకుతోడు ఫోన్‌ కూడా అందుబాటులో లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త క్రేజీగా ఆలోచించిన ఆండ్రియా అనే 21 ఏళ్ల యువతి సిక్‌ బ్యాగ్‌(బేబీ డైపర్‌ డిస్పోజల్‌ బ్యాగ్‌)పై రాసిన ‘ప్రేమలేఖ’ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆండ్రియా ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఆమె ప్రేమ ఫలించిందా లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ ‘లేఖ’ను వైరల్‌ చేయాల్సిందే అని నిర్ణయించుకున్నారట నెటిజన్లు.

నాకు బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ చెప్పండి
‘హలో మీరు ఇది చదువుతున్నారు కదా. నా పేరు ఆండ్రియా. నాకు 21 ఏళ్లు. నాకు చాలా బోర్‌ కొడుతోంది. ఇప్పుడు నేను ఉన్న ఫ్లైట్‌ మియామీ నుంచి డీసీ వెళ్తోంది. నిన్న రాత్రి నాలుగు గంటలకు ఈ ఫ్లైట్‌ కోసం టికెట్‌ బుక్‌ చేసుకున్నా. నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఒకరంటే నాకు చాలా ఇష్టం. అతను ఇప్పుడు బోస్టన్‌ నుంచి న్యూ ఒరేలాన్స్‌ వస్తున్నాడు. అందుకే ఎయిర్‌పోర్టులోనే నా ప్రేమ విషయం చెప్పి తనని సర్‌ప్రైజ్‌ చేద్దామనుకుంటున్నాను. నిజంగా నేను ధైర్యవంతురాలిని కదా. కానీ ఏం లాభం ఇది జరిగిన తర్వాత నాలుగు రోజుల్లోనే పై చదువుల కోసం నేను ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. ఇక ఐదు నెలల పాటు తనని కలిసే వీలే ఉండదు. నాకు బెస్టాఫ్‌ లక్‌ చెప్పండి. అవును బార్ఫ్‌ బ్యాగ్‌పైనే నా భావాలన్నీ రాస్తున్నా కానీ ఏం చేయను వైఫై రావట్లేదు. ఒంటరి ప్రయాణమేమో బోర్‌ కొడుతోంది. మీకు కూడా ఎప్పుడైనా బోర్‌ కొడితే ఇలాంటి క్రేజీ పనులు చేయండి. బాగుంటుంది’ అంటూ ఆండ్రియా తన మనసులోని భావాలని రాసుకొచ్చింది. ఆండ్రియా రాసిన ఈ ‘లెటర్‌’  తనకు దొరకటంతో క్లీనింగ్‌ సిబ్బంది ఈ విషయాన్ని రెడిట్‌ వెబ్‌సైట్‌తో పంచుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top