బాత్‌రూం సింక్స్‌ రూ.18 లక్షలట!

Kim Kardashian Paid Rs 18 Lakh for her Bathroom Sinks - Sakshi

రియాలిటీ టీవీ మొఘల్‌, అమెరికా నటి కిమ్‌ కర్దాషియాన్‌ తన ఇంట్లోని బాత్‌రూం సింకులకు ఏకంగా రూ.18 లక్షలు చెల్లించందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా ఓ వీడియో ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. బాత్‌రూం సింక్స్‌కు రూ.18 లక్షలు ఏంటిరా నాయనా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ డబ్బులతో మధ్యతరగతి కుటుంబాలు మూడు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లులు నిర్మించుకునేవని నిట్టూరుస్తున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

పూర్తి ఆర్కిటెక్ట్‌ డిజైన్స్‌తో కూడిన ఈ బాత్‌రూం బెసిన్స్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక ఈ టీవీ మొఘల్‌ షేర్‌ చేసిన వీడియోలో.. వాష్‌ బేసిన్స్‌కు బేసిన్స్‌ లేకుండా టాప్స్‌ మాత్రమే ఉన్నాయి. ఇవి ఎలా పనిచేస్తాయని నెటిజన్లు ప్రశ్నలు సంధించడంతో ఆమె ట్యాప్‌లు ఆన్‌ చేసి మరి వాటి పనితీరును చూపించింది. ఈ సింక్‌పై చిన్న చీలక ఉందని, దానిలో నుంచి నీళ్లు వెళ్తాయని, ట్యాప్‌ను ఎంత ప్రెజర్‌తో పెట్టినా నీరు పక్కకు వెళ్లవని, అదే దీని ప్రత్యేకతని చెప్పుకొచ్చింది.  తన భర్త, ప్రముఖ రాపర్‌ కన్యే వెస్ట్‌, డిజైనర్‌ ఆక్సెల్‌ వర్‌వోడోర్ట్‌, ఆర్కిటెక్ట్‌ క్లాడియో సిల్వర్పిన్‌లు కలిసి సంయుక్తంగా ఈ సింక్స్‌ను రూపొందించారని పేర్కొంది.


bathroom tour!

A post shared by Kim Kardashian Snapchat 🍑 (@kimkardashiansnap) on

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top