TV Actress Kim Kardashian Spotted With World Most Expensive Hand Bag, Check Price Details - Sakshi
Sakshi News home page

Kim Kardashian Expensive Hand Bag: చిన్న హ్యాండ్ బ్యాగ్.. అన్ని కోట్ల రూపాయలా?

Published Mon, Jul 31 2023 12:49 PM

Actress Kim Kardashian Hand Bag Cost Details - Sakshi

అమ్మాయిలు కావొచ్చు ఆంటీలు కావొచ్చు హ్యాండ్ బ్యాగ్స్ ఉపయోగిస్తుంటారు. రూ.100 దగ్గర నుంచి మొదలుపెడితే వేలు విలువ చేసేవి కొంటుంటారు. యూజ్ చేసిన దానిబట్టి వాటి మన్నిక ఆధారపడి ఉంటుంది. అయితే ఓ నటి దగ్గర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ ఉంది. దాని ఖరీదు ఎంతో చెబితే మీరు ఆశ్చర్యపోవడం సంగతి అటుంచితే ఒక్క చిన్న బ్యాగ్ కోసం అన్ని కోట్లు ఎందుకురా బాబు అనుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయమే హాట్ టాపిక్.

(ఇదీ చదవండి: తమన్నాకు వింత పరిస్థితి.. ఒకే హీరోకి లవర్‌, సిస్టర్‌‌గా!)

అమెరికన్ నటి కమ్ మోడల్ కిమ్ కర్దాషియన్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.  ఫ్యాషన్ విషయంలో అప్డేట్‌గా ఉండటమే కాదు అత్యంత ఖరీదైన వస్తువుల‍్ని ఉపయోగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే డ్రస్సుల దగ్గర మిగతా యాక్సెసరీస్ వరకు వాటి స్పెషాలిటీ, కాస్ట్ ఎంతో తెలుసుకోవాలని అభిమానులు ఆరాటపడుతుంటారు. ఇప్పుడు అలా ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ చూడటానికి వచ్చింది. కాకపోతే తనతో పాటు అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌ని కూడా తీసుకొచ్చింది.

సిల్వర్ కలర్‌లో మెరిసిపోతున్న ఈ హ్యాండ్ బ్యాగ్ ధర అక్షరాలా రూ.3,12,61,000 అని తెలుస్తోంది. ఇది చూసిన నోరెళ్లబెడుతున్న నెటిజన్స్.. అంతలా అందులో ఏముందా అని కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ బ్యాగ్‌ని హిర్మేస్ కంపెనీ తయారు చేసింది. బంగారం, డైమండ్‌తో దీన్ని డిజైన్ చేశారు. ప్రపంచంలో చాలా కొద్దిమంది దగ్గర మాత్రమే ఈ బ్యాగ్ ఉంది. దీన్ని స్పెషల్‌గా కొందరు కస్టమర్ల కోసం తయారు చేస్తుంటారు. ప్రస్తుతానికైతే ఈ బ్యాగ్ లు ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో లేవని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!)

Advertisement
Advertisement