
డ్యాన్స్‌కు వయసుతో సంబంధంలేదని నిరూపించాడు ఓ తాతయ్య. ముసలితనంలో కూడా హుషారెత్తించే స్టెప్పులేసి అదరహో అనిపించాడు. 1951లో రాజ్‌కపూర్ దర్శకత్వంలో వచ్చిన ఆవారా చిత్రంలోని ‘ఘర్ ఆయా మేరా పర్‌దేసి..’ పాటకు తనదైన శైలిలో డ్యాన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. పుల్ జోష్‌తో సింపుల్ స్టెప్పులేస్తూ వావ్.. అనిపించాడు. తాతయ్య డ్యాన్స్ వీడియోను హర్షా గోయెంకా అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
‘వయసు పెరిగిందని డాన్స్ చేయడం మానేయకండి. డ్యాన్స్ మానేస్తే మీరు ముసలివాళ్లు అయిపోతారు. చాచా జాన్‌ను చూడండి’ అంటూ గోయెంకా ఆ వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోకు 13 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. తాతయ్య డ్యాన్స్‌కు నెటిజన్ ఫిదా అయ్యారు. ‘ సూపర్ చాచా’, ‘వావ్ ఇరగదీశావ్.. రాక్‌స్టార్’ , ‘ నీలాగా ప్రతి ఒక్కరు లైఫ్‌ను ఎంజాయ్ చేయాలి’ అంటూ తాతపై ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు.