సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థి అదృశ్యమవడం కలకలం రేపుతోంది. యూనివర్సిటీలో చదువుతున్న రాహుల్ నాయక్ అనే విద్యార్థి సోమవారం నుంచి కనిపించడం లేదు. దీంతో తోటి విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌లో అధ్యాపకులు కావాలనే ఫెయిల్ చేశారని రాహుల్ మనస్థాపం చెందినట్టు తెలుస్తోంది. రాహుల్ అదృశ్యంపై అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.