రేపు ప్రజాసంకల్పయాత్ర నిలుపుదల | One day break for Praja Sankalpa Yatra over AP bandh | Sakshi
Sakshi News home page

రేపు ప్రజాసంకల్పయాత్ర నిలుపుదల

Feb 7 2018 10:09 AM | Updated on Aug 18 2018 4:18 PM

One day break for Praja Sankalpa Yatra over AP bandh - Sakshi

వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర ఫైల్‌ ఫోటో

సాక్షి, అమరావతి : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు రేపు (గురువారం) నిలుపుదల చేయనున్నట్లు ఆ పార్టీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు మద్దతుగా రేపు వామపక్షాల బంద్‌కు వైఎస్‌ఆర్‌ సీపీ తన విధానంలో భాగంగా సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బంద్‌కు మద్దతుగా వైఎస్‌ జగన్‌.. రేపు ప్రజాసంకల్పయాత్ర నిలిపివేయనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలంతా ఒకటిగా నిలబడాలని, రేపటి బంద్‌ను విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ విజ్ఞప్తి చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement