నాలుగేళ్లు కేంద్రానికి ఊడిగం చేసింది ఎవరు? | YSRCP Spokesperson sudhakar babu takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లు కేంద్రానికి ఊడిగం చేసింది ఎవరు?

Sep 23 2018 4:41 PM | Updated on Sep 23 2018 4:50 PM

YSRCP Spokesperson sudhakar babu takes on Chandrababu Naidu - Sakshi

విజయవాడ:  రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. నాలుగేళ్లు కేంద్రానికి ఊడిగం చేసింది ఎవరని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు మండిపడ్డారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత సూపర్‌ ప్యాకేజీ ఇచ్చారంటూ మోదీకి ధన్యవాద తీర్మానాలు చేసింది ఏపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ-బాబు జోడి అధికారంలోకి వచ్చి, రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని ఈ సందర్భంగా నిలదీశారు. లస్కర్‌ పని చేస్తూ ప్రాజెక్టులు జాతికి అంకితం అంటే నమ్మేదెవరన్నారు. ఆదివారం ప్రెస్‌మీట్‌లో  మాట్లాడిన సుధాకర్‌ బాబు.. బాబు తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

ప్రాజెక్టులను నిర్మించాలని తానే కలలు కన్నట్టు.. తానే శంకుస్థాపనలు చేసి పూర్తి చేసినట్లు, వాటిని ఎన్నికల సమీపిస‍్తున్న తరుణంలో జాతికి అంకితం ఇస్తున్నట్లు చంద్రబాబు నాయుడు హడావుడి చేస్తారనే విషయాన్ని తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఎప్పుడో ఊహించి చెప్పారని సుధాకర్‌ బాబు ఈ సందర్భంగా పేర‍్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి చేపట్టి 80-90 శాతం పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులకు గేట్లు ఎత్తి, నీళ్లు వదిలి దానికి జలహారతి కార్యక్రమం అంటూ పేరు పెట్టి రాష్ట్ర ప్రజలను చంద్రబాబు దగా చేస్తున్నారన్నారు. ఎవరికైనా ఊడిగం చేయాల్సి వస్తే.. ఎవరికైనా దాసోహం చేయాల్సి వస్తే.. ఎవరితోనైనా లాలూచీ పడాల్సి వస్తే.. ఎవరి కాళ్ళు అయినా పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే... ఆ అవసరం ఈ రోజు ఒక్క చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని సుధాకర్‌ బాబు ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement