‘దాణా కుంభకోణం కంటే పెద్ద స్కాం’

YSRCP Leader Vijaya Sai Reddy Critics Chandrababu Over Neeru Chettu - Sakshi

సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం చేపట్టిన ‘నీరు-చెట్టు’పథకంలో అంతులేని అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దాంతో రాష్ట్ర ప్రభుత్వం నీరు-చెట్టు పనులపై దృష్టి పెట్టింది. ఆ పథకంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను నిగ్గుతేల్చేందుకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను రంగంలోకి దింపింది. సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా మాజీ సీఎం చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు. ‘చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరిగిన నీరు-చెట్టు కుంభకోణం బీహార్ దాణా స్కాం కంటే పెద్దది. 22 వేల కోట్ల నిధులను జన్మభూమి కమిటీలకు పంచి పెట్టారు. సమగ్ర దర్యాప్తు జరిగితే బాబు, చిన బాబు ఇంకా అనేక పెద్ద తలకాయల బండారం బయట పడుతుంది’ అని పేర్కొన్నారు.
(చదవండి : నేతా.. కక్కిస్తా మేత!)

బంధుప్రీతిలో బాబును మించినోళ్లు లేరు..!
చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన ఉండదనే విషయం మరోసారి రుజువైందని విజయసాయి రెడ్డి అన్నారు. కాపులు, బలహీనవర్గాలను ఆయన ఎప్పుడూ విశ్వసించరనేది మరోసారి అర్థమైందన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ (పీఏసీ) పదవిని చాలా మంది ఆశించినా చివరకు పయ్యావుల కేశవ్‌ను ఎంపిక చేసి బాబు బంధుప్రీతి చాటుకున్నారని ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top