
సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, జేసీ దివాకర్‌రెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ లాబీల్లో మంగళవారం టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, జేసీ దివాకర్‌రెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అసెంబ్లీ లాబీల్లో పరస్పరం ఎదురైన ఈ ఇద్దరు నేతలు మాటలు విసుసురుకున్నారు. రాయలసీమ ప్రాంతంపై కోపం తగ్గిందా అంటూ యనమలను జేసీ ప్రశ్నించారు. మీ వల్లే నష్టం జరిగిందంటూ యనమల ఘాటుగా సమాధానమివ్వడంతో జేసీ చిన్నబోయారు. కాగా, తాను పార్టీ మారతానంటూ వచ్చిన వార్తలను అంతకుముందు జేసీ దివాకర్‌రెడ్డి తోసిపుచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. బీజేపీ నుంచి తనను ఎవరూ సంప్రదించలేదన్నారు. బీజేపీని బలోపేతం చేసుకోవడం కోసం ఆ పార్టీ నాయకులు ప్రయత్నించడంతో తప్పేంలేదని సమర్థించారు.
కాగా, ప్రతిపక్ష నాయకుడు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి 25 తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు. (చదవండి: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం)