
సాక్షి,న్యూఢిల్లీ: తీవ్ర ఉత్కంఠ నడుమ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విస్పష్ట ఆధిక్యం కనబరిచిన బీజేపీలో ఉత్సాహం నెలకొంది. స్పష్టమెన మెజారిటీతో రెండు రాష్ట్రాల్లో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. అటు పార్లమెంట్‌కు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ చిరునవ్వులు చిందిస్తూ విక్టరీ సింబల్ ప్రదర్శించారు. గుజరాత్,హిమాచల్‌లో పార్టీ విజయం పట్ల ప్రధాని మోదీని పలువురు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు అభినందించారు.