టీఆర్‌ఎస్‌ ప్రధాని అభ్యర్థి ఎవరు?

Who is the TRS Prime Ministerial candidate - Sakshi

కేటీఆర్‌ను ప్రశ్నించిన బండారు దత్తాత్రేయ

మళ్లీ నరేంద్ర మోదీనే ప్రధాని

బీసీల ఆత్మగౌరవ సభలో పాల్గొన్న ఎంపీ

హైదరాబాద్‌: కొన్ని రోజులుగా 16 ఎంపీ సీట్లను గెలుస్తామంటూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఊదరగొడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. బీజేపీ, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌ గ్రౌండ్స్‌లో బీసీల ఆత్మగౌరవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ బీజేపీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉండగా విద్య, ఉద్యోగాల్లో బీసీలకు తీవ్ర అన్యా యం జరిగిందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా నరేంద్ర మోదీనే మరోసారి ప్రధాని అవుతారని ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా విద్య, ఉద్యోగాల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నా రు. కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుందని ఆరోపించారు. మోదీ ప్రధాని అయ్యాక కొద్ది రోజులకే కమిషన్‌ను ఏర్పాటు చేసి, దానికి అన్ని అర్హతలు కల్పించారని గుర్తు చేశారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ మజ్లిస్‌తో స్నేహం చేస్తూ విచిత్రమైన రాజకీయాలకు తెరలేపుతోందన్నారు. రానున్న ఎన్నికలలో ప్రజలంతా ఒక్కటై బీజేపీకి అత్యధిక ఎంపీ సీట్లు గెలిపించి మోదీని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. మోదీ బీసీ కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న బీసీలపై ఆయన మమకారం చూపించారన్నారు. కులం రంగు పులుముకోకుండా అగ్రకులస్తులకు కూడా రిజర్వేషన్లు కల్పించిన ఘనత మోదీదే అని కొనియాడారు. ఈ కార్యక్ర మంలో మాజీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, బీజేపీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీరాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top