‘జగన్‌ అంటే’..టీడీపీ పాలన అంతం! | Vijayasai Reddy fires on Chandrababu in Twitter | Sakshi
Sakshi News home page

‘జగన్‌ అంటే’..టీడీపీ పాలన అంతం!

Sep 4 2018 4:02 AM | Updated on Sep 4 2018 4:03 AM

Vijayasai Reddy fires on Chandrababu in Twitter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై ట్విట్టర్‌ వేదికగా టీడీపీ నిందారోపణలు చేయడం పట్ల వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఘాటుగా ప్రతిస్పందించారు. ఘోర వైఫల్యాలతో పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయిన టీడీపీ రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులకు దూరమైపోయిందన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రజల మనసుల్లో ఏ స్థాయిలో ఉన్నారనే విషయాన్ని టీడీపీ మర్చిపోయిందని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. జగన్‌ అంటే టీడీపీ పాలనను అంతం చేయడం అని చెప్పారు. జగన్‌ అంటే పురోగతి, దార్శనికత, బాధ్యత, ఐక్యత, సానుభూతి, ప్రేమ, కరుణ అని ఉద్ఘాటించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిచి చూడాల్సిన సమయం ఆసన్నమైందని, తాము అధికారంలోకి వస్తున్నామని విజయసాయిరెడ్డి సంపూర్ణ విశ్వాసాన్ని, ధీమాను వ్యక్తం చేశారు. ట్వీట్‌తో పాటు జగన్‌ పాదయాత్ర దృశ్యమాలిక వీడియోను పొందుపర్చారు. 

సినిమాలో వెన్నుపోటు ఉంటుందా? ఉండదా?
బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో చంద్రబాబు ఎలా వంచించారో, ఎలా వెన్నుపోటు పొడిచారో చూపిస్తారా? లేదా? అని విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌లో ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement