అనుకూల మీడియాకు లీక్‌ చేయడం వెనుక ఉద్దేశం?

Vijaya Sai Reddy Slams Cm Chandrababu Naidu Over Blocking CBI In AP - Sakshi

ట్విటర్‌లో ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీలో సీబీఐ అడుగుపెట్టడానికి వీల్లేదంటూ సీఎం చంద్రబాబు నాయుడు జారీ చేసిన జీవోను అనుకూల మీడియాకు లీకు చేయడం వెనుక ఉద్దేశం ఏంటని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. ‘నాలుగున్నరేళ్ళలో చంద్రబాబు వందలకొద్దీ రహస్య జీవోలు జారీ చేశారు. సమాచార హక్కు చట్టానికి కూడా దొరక్కుండా వాటిని రహస్యంగా పెట్టారు. సీబీఐ ఎంట్రీ నిషేధంపై జారీ చేసిన రహస్య జీవోను తమ అనుకూల మీడియాకు లీక్‌ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? మేనేజ్‌ చేసే దారులు కనిపించకే చంద్రబాబు ఈ దారి పట్టారా?’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి, అక్రమాలు, హత్యాయత్నం కుట్రలపై స్వయం ప్రతిపత్తి కలిగిన సీబీఐ దర్యాప్తు జరపడానికి వీల్లేదంటూ, అసలు ఏపీలో సీబీఐ అడుగుపెట్టడానికే వీల్లేదంటూ టీడీపీ సర్కారు రహస్యంగా జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవో జారీపై అటు అధికార యంత్రాంగం, ఇటు ప్రజలు, నాయకులు విస్తుపోతున్నారు. వారి అవినీతి బండారం ఎక్కడ బయటపడిపోతుందోననే భయంతోనే చంద్రబాబు ఈ జీవో జారీ చేశారని ఆరోపిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top