నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు

trs mp balka suman fires on revanth reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ కొనుగోళ్లలో అవినీతి అంశంపై కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ విషయమై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరిన టీఆర్‌ఎస్‌ నేతలు.. ఆ తర్వాత పారిపోయారంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగతో మేం చర్చలు జరపబోమని ఆయన అన్నారు. పార్టీలు మారి ప్రజలను మోసం చేసిన సంస్కృతి రేవంత్‌రెడ్డిదని ధ్వజమెత్తారు.

విద్యుత్‌ కొనుగోళ్లపై బహిరంగ చర్చకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టు బాల్క సుమన్‌ అన్నారు. 'నేను నీలా పార్టీ మారను. ఎక్కడికీ పారిపోను. ఉద్యమంలో కేసులు ఎదుర్కొని దెబ్బలు తిని ఎంపీగా ఎన్నికయ్యాను. నువ్వు మాత్రం రాజీనామా చేయమంటే పారిపోయావు. తెలంగాణ ద్రోహుల పక్షాన నిలబడ్డావు. నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు' అని రేవంత్‌రెడ్డిపై బాల్క సుమన్‌ మండిపడ్డారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top