బాలయ్యపై ఈసీకి టీటా ఫిర్యాదు | Telangana Information Technology Association Complaint to EC On Balakrishna | Sakshi
Sakshi News home page

బాలయ్యపై ఈసీకి టీటా ఫిర్యాదు

Dec 5 2018 2:13 AM | Updated on Dec 5 2018 9:46 AM

Telangana Information Technology Association Complaint to EC On Balakrishna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తెలంగాణ ఐటీ పరిశ్రమ, తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీటా) రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కు ఫిర్యాదు చేసింది. మొన్నటిదాకా ఐటీ స్పెల్లింగ్‌ తెలియని తెలంగాణ వాళ్లకు చంద్రబాబు ఐటీ డెఫినిషన్‌ తెలియజెప్పారని బాలయ్య వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలతో కూడిన సీడీని ఈసీ అందజేసింది. ఉద్దేశ పూర్వకంగా ఐటీ ఉద్యోగుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని స్పష్టంచేసింది. సైబరాబాద్‌ అభివృద్ధి చేసింది తానేనని, ఐటీ ఉద్యోగులు ఈ విషయం గుర్తుంచుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించడాన్ని కూడా ఖండిస్తున్నట్లు పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement