ఫీజు నియంత్రణ నివేదికను వెల్లడించాలి

tammineni on school fees - Sakshi

సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం నియమించిన ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ ఫీజులను నియంత్రించకపోగా పెంచాలని సిఫారసు చేయడం అన్యాయమని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజులు రాష్ట్రంలోనే అత్యధికంగా ఉన్నాయని, తక్షణమే కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని సోమవారం డిమాండ్‌ చేశారు.

అధిక ఫీజులు అరికట్టాలని సాగిన ఉద్యమాల వల్లే కమిటీని ప్రభుత్వం నియమించిందని గుర్తుచేశారు. మేనేజ్‌మెంట్ల సహాయ నిరాకరణ వల్ల ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన నివేదిక 10 నెలలు ఆలస్యంగా ఇచ్చినట్లు తెలుస్తోందని అన్నారు. నివేదికలో ఫీజుల భారం తగ్గించాలని ప్రతిపాదించకపోగా.. మరింత పెంచేలా సూచనలు చేసినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు. విద్యారంగాన్ని పట్టిపీడిస్తున్న కార్పొరేట్‌ స్కూళ్ల ఫీజుల సమస్యపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top