బీజేపీకి షాక్‌.. కీలక నేత రాజీనామా | Sangareddy BJP President Buchireddy Resign His Post | Sakshi
Sakshi News home page

Nov 1 2018 1:49 PM | Updated on Nov 1 2018 3:28 PM

Sangareddy BJP President Buchireddy Resign His Post - Sakshi

సాక్షి, సంగారెడ్డి : ఎన్నికల వేళ సంగారెడ్డిలో బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, మరికొంత మంది కార్యకర్తలు రాజీనామా చేశారు. పార్టీలో పనిచేసిన వారికి సరైన గుర్తింపు లేకుండా పోయిందని, అందుకే రాజీనామా చేస్తున్నామని బుచ్చిరెడ్డి తెలిపారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ రెండు సార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. సిద్దాంతాలకు కట్టుబడి పనిచేశాను. సంగారెడ్డి టికెట్‌ నాకే వస్తుందని ఆశ పడ్డాను. కానీ కొంత మంది రాకుండా అడ్డుపడ్డారు. బీజేపీలో కూడా డబ్బులు ఉంటేనే పనులు జరుగుతున్నాయి. పని చేసిన వారిని గుర్తించకకోవడం బాధగా ఉంది. రాజకీయాలు లేకపోతే వ్యవసాయం చేస్తూ బతుకుతా. వేరే పార్టీలోకి చేరేది లేనిది తర్వాత తెలియజేస్తా’ అని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement