
సాక్షి, చెన్నై : దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై రోజుకో వార్త వెలువడుతున్న విషయం తెలిసిందే. రజనీ పుట్టినరోజు సందర్భంగా పార్టీపై ప్రకటన చేస్తారని, భావించినా అలాంటిదేమీ జరగలేదు. తాజాగా ఈ నెల 31లోగా రజనీకాంత్ రాజకీయ పార్టీ గురించి వెల్లడిస్తారంటూ గాంధీయ మక్కల్ సంఘం అధ్యక్షుడు తమిళరువు మణియన్ తెలిపారు. కాగా గతంలో అభిమానులతో సమావేశమైన సందర్భంలో రజనీ రాజకీయల్లోకి వస్తున్నారంటూ భారీగా ప్రచారం జరిగిన విషయం విదితమే.