‘చౌకీదార్‌ చోర్‌ హై’.. రాహుల్‌గాంధీ విచారం

Rahul Gandhi Expresses Regret Over Chowkidaar Jibe at Modi - Sakshi

న్యూఢిల్లీ : దేశాన్ని కుదిపేసిన రఫేల్‌ ఒప్పందంలో ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి.. ‘చౌకీదార్‌ చోర్‌ హై’ (కాపలాదారుడే దొంగ) అని పేర్కొనడానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులే నిదర్శమంటూ తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి సుప్రీంకోర్టు అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ప్రచార వేడీలో తాను ఆ వ్యాఖ్యలు చేశానని, తన వ్యాఖ్యలను ప్రత్యర్థులు వక్రీకరించారని ఆయన సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన వివరణలో పేర్కొన్నారు. 

రఫేల్‌ ఒప్పందంలో ‘చోకీదార్‌ చోర్‌ హై’ అంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టు కూడా తేల్చిందని ఏప్రిల్‌ 10న రాహుల్‌ గాంధీ పేర్కొన్నట్టు కథనాలు వచ్చాయి. దీంతో బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి.. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గతవారం విచారణ సుప్రీంకోర్టు.. రఫేల్‌ డీల్‌లో ఏప్రిల్‌ 10న తాము ఇచ్చిన ఉత్తర్వులను తప్పుగా ఆపాదించి.. వ్యాఖ్యలు చేశారని, దీనిపై ఏప్రిల్‌ 22లోగా రాహుల్‌ గాంధీ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో రాహుల్‌ ఈ మేరకు సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top