
సాక్షి, చిత్తూరు : అధికార పక్ష అన్యాయాలను ప్రజలకు వివరిస్తూనే.. వారికి నేనున్నానంటూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇస్తున్నారు. ఆయన చేపట్టిన పాదయాత్ర నేటికి 51వ రోజుకి చేరుకుంది. బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా చింతపర్తి శివారు నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు.
నేటి యాత్ర చింతపర్తి శివారు నుంచి ప్రారంభమై పాతకోటపల్లి, బీదవారిపల్లి, గండబోయనపల్లి, డెకలకొండ మీదుగా కలికిర వరకు కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ జనంతో మమేకం కానున్నారు.