
సాక్షి, చిత్తూరు : అధికార పక్ష అన్యాయాలను ప్రజలకు వివరిస్తూనే.. వారికి నేనున్నానంటూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇస్తున్నారు. ఆయన చేపట్టిన పాదయాత్ర నేటికి 48వ రోజుకి చేరుకుంది. ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా మూలపల్లిక్రాస్ నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు.
నేటి యాత్ర ఎర్రసానిపల్లె, ఎద్దులవారిపల్లె, కన్నెమడుగు, కె రామిగానివారిపల్లో, రేణుమాకులపల్లి క్రాస్, మీదుగా తిమ్మయ్యగారిపల్లి చేరుకుంటుంది. ఆపై పరదేశిపల్లె, దాదంవారిపల్లి, తుపల్లి క్రాస్ మీదుగా ముదివేడు వరకు చేరుకుని అక్కడ ముగుస్తుంది.
ఇక పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ కన్నెమడుగు, దాదంవారిపల్లో, ముదివేడుల్లో దివంగత నేత వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. ఎద్దులవారిపల్లె, రేణుమాకులపల్లె క్రాస్, పరదేశీపల్లెక్రాస్, తూపల్లిక్రాస్‌లో ఆయన జనంతో మమేకం కానున్నారు.