
సాక్షి, చిత్తూరు : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర 61వ రోజు ముగిసింది. శనివారం ఉదయం చిత్తూరు జిల్లా కుప్పంబాదూరు నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన వైఎస్ జగన్ నడవలురు వద్ద ముగించారు.
ఒడ్డుకాల్వ, నురావారిపల్లిక్రాస్, బలిజపల్లి, పీవీ పురం, రామిరెడ్డిపల్లి, గంగిరెడ్డిపల్లి క్రాస్, కమ్మకండ్రిగ రామచంద్రాపురం, లక్ష్మీనగర్ మీదుగా యాత్ర కొనసాగింది. దారిపోడవునా ప్రజలతో మమేకం అయి వారి సమస్యలు తెలుసుకున్న జగన్ రామచంద్రాపురం బహిరంగ సభలో ప్రసంగించారు. పాదయాత్రలో భాగంగా నేడు వైఎస్ జగన్ 11.7 కిలోమీటర్లు నడిచారు.