కాంగ్రెస్‌ యాత్రలతో ఒరిగేదేమీ లేదు

pocharam srinivas reddy fires on congress leaders - Sakshi

‘సారథి’కళాకారుల సదస్సులో మంత్రి పోచారం

సాక్షి, హైదరాబాద్‌ : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా ఎన్నో పథకాలు తీసుకొస్తుంటే కాంగ్రెస్‌ నేతలు బిత్తరబోయి ఏవేవో మాట్లాడుతున్నారని వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. రైతు సమన్వయ సమితులు, పెట్టుబడి సాయం, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వంటి అంశాలపై శుక్రవారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఏమి చేయాలో అర్థం కాక కాంగ్రెస్‌ నేతలు పాదయాత్ర, బస్సు యాత్రలు అంటున్నారని పోచారం ఎద్దేవా చేశారు. ‘మీ యాత్రల (కాంగ్రెస్‌ యాత్రల) వల్ల ఒరి గేది ఏమి ఉండదు, సర్కారుది మాత్రం శోభాయాత్ర, సంక్షేమయాత్ర, అభివృద్ధి యాత్ర’ అని అన్నారు. సారథి కళాకారులు చేసే సాంస్కృతిక యాత్ర చూసి కాంగ్రెస్‌ పారిపోక తప్పదన్నారు. భూ లక్ష్మి, క్రాంతిలక్ష్మి, ధాన్య లక్ష్మి ఇలా 11 రకాల లక్ష్ములను ప్రభుత్వం ప్రజల కోసం తీసుకొచ్చిందన్నారు. ఏప్రిల్‌ 20 నుంచి 15 వరకు రైతులకు పెట్టుబడి చెక్కులు పంపిణీ చేస్తుందన్నారు. పంపిణీ కార్యక్రమానికి గంట ముందుగా కళాకారులు ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top