
పెదపూడి(అనపర్తి): ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం సిగ్గుచేటని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. తానే రోడ్లు, లైట్లు వేశానని, తాను చేసిన అభివృద్ధి నీడలో మీరంతా బతుకుతున్నారని సీఎం చంద్రబాబు అనడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.