షారుఖ్‌ నా కోసం ప్రార్థించు.. | Noor Jehan Asks Shah Rukh Khan To Pray For Her Win In Elections | Sakshi
Sakshi News home page

షారుఖ్‌ నా కోసం ప్రార్థించు..

Jun 8 2018 5:38 PM | Updated on Jun 8 2018 5:38 PM

Noor Jehan Asks Shah Rukh Khan To Pray For Her Win In Elections - Sakshi

షారుఖ్‌తో నూర్‌ జెహాన్‌

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు కోసం ప్రార్థించాలని షారుఖ్‌ ఖాన్‌ను ఆయన సోదరి నూర్‌ జెహాన్‌ కోరారు. వరుసకు షారుఖ్‌కు కజిన్‌ అయిన జెహాన్ పాక్‌లోని పెషావర్‌ నుంచి పోటీ చేయబోతున్నారు. పెషావర్‌లోని PK-77 నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆమె సిద్ధం అవుతున్నారు.

షారుఖ్ తండ్రి తరఫు బంధువైన నూర్ జెహాన్ గతంలో రెండుసార్లు షారుఖ్‌ను కలిశారు. ఆమె కుటుంబం ఇప్పటికీ భారత్‌లోని బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉంది. ‘మహిళల సాధికారత కోసం నేను పని చేయాలనుకుంటున్నాను. నా నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాను’ అని ఆమె తెలిపారు. ఆమె ఎన్నికల ప్రచారానికి సోదరుడు మన్సూర్‌ నాయకత్వం వహిస్తున్నారు.

వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. బచాఖాన్‌గా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నేతృత్వంలో జరిగిన ఖుదై ఖిద్మాత్గర్‌ ఉద్యమం(ఎర్ర చొక్కా ఉద్యమం)లో జెహాన్‌ పూర్వీకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement