ప్రత్యేక హోదాకు మరో రాష్ట్రం డిమాండ్‌

Nitish Kumar Demands Special Status For Bihar - Sakshi

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వపై పలు ఆరోపణలు చేసిన బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ మరోసారి కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని డిమాండ్‌ చేశారు. ఇటీవల ఓ సమావేశంలో నితీష్‌ మాట్లాడుతూ.. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వల్ల ఎవ్వరికి ప్రయోజనం కలగలేదని, ఆ నిర్ణయం వల్ల సామాజ్య ప్రజలు  నష్టపోయారని నితీష్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మంగళవారం మరోసారి కేంద్ర ప్రభుత్వంపై నితీష్‌ పలు వ్యాఖ్యలు చేశారు.

15వ ఆర్థిక సంఘం ప్రయోజనాలు రాష్ట్రాలకు ఏవిధంగా వర్తిస్తాయో తెలపాలని ప్రశ్నించారు. 1971 జనాభా లెక్కల  ప్రకారం కాకుండా 2011 లెక్కల  ప్రకారం రాష్ట్రాలకు  నిధులు పంపిణీ చేయాలని  డిమాండ్‌ చేశారు. ప్రస్తుత జనాభా ప్రకారం నిధులు కేటాయిస్తేనే రాష్ట్రాలు ముందుకు వెళ్తాయని పేర్కొన్నారు. బీజేపీతో చేతులు కలిపాక నితీష్‌ కుమార్‌ ప్రత్యేక హోదా గురించి మర్చిపోయారని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ పలుమార్లు విమర్శించిన విషయం తెలిసిందే.

ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో బిహార్‌ రాష్ట్ర విభజన చట్టం 2000 ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్‌​  డిమాండ్‌ చేశారు. 15వ ఆర్థిక సంఘం పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచడాన్ని నితీష్‌ వ్యతిరేకించారు.కేంద్రంపై నితీష్‌ రోజుకో ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బిహార్‌ రాజకీయం ఒక్కసారిగా వెడెక్కింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top