కేంద్రంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ..! | NDA will be single largest In Upcoming Polls | Sakshi
Sakshi News home page

కేంద్రంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ..!

Mar 10 2019 10:22 AM | Updated on Mar 18 2019 9:02 PM

NDA will be single largest In Upcoming Polls - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రంలో ఏపార్టీ అధికారం చేజిక్కించుకుంటుందని తెలుసుకునేందుకు పలు సర్వే సంస్థలు ఓటర్ల నాడిని పరీక్షిస్తున్నాయి. ఓ జాతీయ మీడియా సంస్థ చేపట్టిన సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ (ఎన్డీయే) అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని సర్వే తేల్చింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి సీట్లశాతం తక్కువగా ఉంటుందని సర్వే తెలిపింది. మొత్తం 545 లోక్‌సభ స్థానాలకు గాను అధికార బీజేపీ 264 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవరిస్తుందని సర్వేలో వెల్లడయింది.

గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌కు ఊరటకలిగించే విధంగా ఆపార్టీ 165 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఎన్డీయే, యూపీయేతర పార్టీలు 114 సీట్లు కైవసం చేసుకుంటున్నట్లు సర్వే వెల్లడించింది. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే ఏ పార్టీ అయినా 272స్థానాల బలం ఉండాలి. గత ఎన్నికల మాదిరిగానే యూపీ, బిహార్‌, హార్యానా, గుజారత్‌ రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగిస్తుందని, మహారాష్ట్రలో శివసేన, బీజేపీ కూటమి 30 స్థానాలను గెలుచుకుంటుదని తేలింది. ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యం కొనసాగుతుందని సర్వే అభిప్రాయపడింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement