మోదీ సర్వేలో విపక్ష కూటమిపై ప్రశ్న

NaMo App Survey Ask Whether Grand Alliance Will Have An Impact - Sakshi

న్యూఢిల్లీ: ‘బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏర్పాటు చేసుకున్న మహా కూటమి ప్రభావం మీ నియోజకవర్గంలో ఉంటుందా?’.. ఈ ప్రశ్న ప్రధాని నరేంద్ర మోదీకు సంబంధించిన నమో యాప్‌లో నిర్వహిస్తున్న ‘పీపుల్స్‌ పల్స్‌’ సర్వేలోనిది. దీంతో పాటు పలు ఇతర ప్రశ్నలకు కూడా ఈ సర్వేలో పాల్గొనేవారు సమాధానమివ్వాల్సి ఉంటుంది. ఈ సర్వేలో పాల్గొనాల్సిందిగా పౌరులను కోరుతూ ఓ చిన్న వీడియోను తన ట్విటర్‌ హ్యాండిల్‌లో సోమవారం ప్రధాని మోదీ పోస్ట్‌ చేశారు.

‘నమో యాప్‌లో ఓ సర్వే ప్రారంభమైంది. అందులో పాల్గొని మీ అభిప్రాయాలు చెప్పాలని కోరుతున్నా. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో అవి మాకు తోడ్పడుతాయి’ అని అందులో మోదీ పేర్కొన్నారు. రాష్ట్రం, నియోజకవర్గం, అవినీతి రహిత పాలన, స్వచ్ఛభారత్, మౌలిక వసతులు, చవకగా ఆరోగ్యం, ఆర్థిక రంగం, జాతీయ భద్రత, ఉపాధి, గ్రామీణ విద్యుదీకరణ.. తదితరాలపై పలు ప్రశ్నలున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top