
సాక్షి, విశాఖపట్నం : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రజలతో మమేకమవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావంగా పార్టీ సీనియర్ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం నుంచి విశాఖనగరంలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర పోస్టర్‌ను వైఎస్సార్‌సీపీ నేత మళ్ల విజయప్రసాద్ మంగళవారమిక్కడ ఆవిష్కరించారు.
అగనంపుడిలోని వైఎస్సార్ విగ్రహం నుంచివ విజయసాయిరెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుంది. అడుగడుగునా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారితో మమేకమవుతూ విజయసాయిరెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నారు.