సీఎంకు ఎంపీ అవినాష్‌ రెడ్డి లేఖ | MP Avinash Reddy Write Letter To Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

సీఎంకు ఎంపీ అవినాష్‌ రెడ్డి లేఖ

May 29 2018 3:20 PM | Updated on Jul 28 2018 6:43 PM

MP Avinash Reddy Write Letter To Chandrababu Naidu - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంగళవారం లేఖ రాశారు. జిల్లా ప్రజలు ఎంతో ఆశపెట్టుకున్న కడప రిమ్స్‌ ఆసుపత్రి పరిస్థితి దయనీయంగా మారిందని, ఇటీవల శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి సరైన వైద్యం అందక మృతి చెందారని లేఖలో పేర్కొన్నారు. రిమ్స్‌లో వైద్య సిబ్బందిని వెంటనే నియమించాలని, న్యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాలను ఏర్పాటు చేయాలని కోరారు. సీటి స్కాన్‌లు ఏర్పాటు చేసి రోగులకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఎంతో మంది గ్రామీణ ప్రాంత ప్రజలు ఆధారపడిన ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement