కవితను ఓడిస్తేనే కేసీఆర్‌కు కనువిప్పు 

mlc jeevan reddy fire on kcr govt - Sakshi

ఆమెకు రైతుల ఓట్లు అడిగే హక్కు లేదు: జీవన్‌రెడ్డి  

సాక్షి, జగిత్యాల: రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే కుట్రతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, నిజామాబాద్‌లో ఎంపీ కవితను ఓడిస్తేనే కేసీఆర్‌కు కనువిప్పు కలుగుతుందని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు.లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్‌కు మద్దతుగా జగిత్యాలలో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.వ్యవసాయ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు రెండూ ఒక్కటేనని.. టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తే బీజేపీకి వేసినట్లేనని పేర్కొన్నారు. కవితకు రైతుల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని చెప్పారు. ఇప్పటికే 15 మంది ఎంపీలుగా ఉండి బయ్యారం, రైల్వేకోచ్, గిరిజన వర్సిటీ ఏర్పాటు వంటివి సాధిం చుకోలేకపోయారని, కాళేశ్వరానికి జాతీయ హోదా సాధించుకోలేకపోయారని చెప్పారు. ఇప్పుడు 16 సీట్లు గెలిస్తే ఏం చక్రం తిప్పుతారని ప్రశ్నించారు.  

విముక్తి కోరుకుంటున్నారు: మధుయాష్కీ 
టీఆర్‌ఎస్‌ పాలన నుంచి రాష్ట్ర ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని కాంగ్రెస్‌ నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి మధుయాష్కీగౌడ్‌ అన్నారు. రాష్ట్ర సాధన కోసం తాను పార్లమెంట్‌లో సైనికుడిగా పోరాడి తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేశామన్నారు. పసుపుబోర్డు ఏర్పాటు, షుగర్‌ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడంతోపాటు ఇచ్చిన హామీల అమలులో ఎంపీ కవిత విఫలమయ్యారన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top