బహిరంగ చర్చకు సిద్ధమా: టీడీపీకి సవాల్‌

MLA Jogi Ramesh Slams Cjandrababu Over His False Statements - Sakshi

సాక్షి, తాడేప‌ల్లి : ఎల్లో మీడియాలో తప్పుడు వార్తలు రాయడం, వాటిని పట్టుకొని టీడీపీ నేతలు మీడియా ముందుకు మళ్ళీ రావడంపై వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ స్పందించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న మాట్లాడుతూ.. అత్య‌వ‌స‌ర స‌ర్వీసులైన 108, 104 గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. 104, 108లలో ఎక్కడ అవినీతి జరిగిందో టీడీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. 108, 104లలో అవినీతి జరిగిందంటున్న మీడియా స‌మ‌క్షంలో టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్ర‌శ్నించారు. సమయం చెబితే త‌న దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకొని వస్తానని, త‌మ దగ్గర ఉన్న ఆధారాలతో టీడీపీ నేతలు రావాలని సవాల్‌ విసిరారు. (‘ఆ భేటీ వెనుక కుట్ర దాగుంది’)

దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన అత్య‌వ‌స‌ర సర్వీసుల వాహనాలు లక్షల మంది ప్రాణాలు నిలబెట్టాయని, చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో 108, 104 వ్యవస్థను నిర్వీర్యం చేశార‌ని మండిప‌డ్డారు. చంద్రబాబు హయాంలో 108, 104 స‌ర్వీసులు స‌రిగా పనిచేయక ఎంతోమంది ప్రాణాలు పోయాయని, ఇవన్నీ ఎల్లో మీడియా పచ్చ గ్యాంగ్‌కు క‌నిపించ‌వా అని ప్ర‌శ్నించారు. 1060 కొత్త వాహనాలు ప్రవేశ పెడితే చంద్రబాబు కడుపు మంటతో మండిపోతున్నార‌ని, పేదల ప్రాణాలు వైఎస్ జ‌‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కాపాడతారని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే దుయ్య‌బ‌ట్టారు. (మార్గమధ్యలో కరోనా.. అంతా పరుగో పరుగు!)

108,104 వాహనాలను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపి టెండర్లు పిలిశామ‌ని, తాడు బొంగరం లేని నేతలు సీఎం వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి మీద విమర్శలు చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంటిలేటర్లు ఉండే 108 వాహనాలు తీసుకువస్తున్నామని జోగి ర‌మేష్ తెలిపారు. 108, 104 టెండర్లకు రెండు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయని, అరబిందో కంపెనీ టెండర్లు దక్కించుకుందని తెలిపారు. అచ్చెన్నాయుడును చంద్రబాబు మోసం చేశారు కాబట్టే ఆదిరెడ్డి భవాని పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసింద‌న్నారు. బాబాయికి అన్యాయం చేసిన చంద్రబాబుకు అనుకూలంగా భవాని ఓటు వేస్తోందా అని ఎమ్మెల్యే జోగి రమేష్ నిల‌దీశారు. (హాలీవుడ్ నిర్మాత‌ ఆత్మ‌హ‌త్య )

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top