అందుకే నాకు ఈ శాఖ కేటాయించారేమో..

Minister Sri Ranganatha Raju Press Meet In Tadepalligudem - Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం : రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని పేదలందరికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. ఇంట్లో ఉండే మహిళల పేరు మీద పట్టాలను ఇస్తామని తెలిపారు. తక్కువ వడ్డీకే హౌసింగ్‌ లోన్స్‌ ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ.. ‘నాకెంతో ఇష్టమైన గృహనిర్మాణ శాఖను నామీద నమ్మకంతో అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు. గతంలో అత్తిలి ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆ నియోజవకర్గంలో 300 ఎకరాల్లో 3000 మందికి పైగా ఇళ్లు కట్టించాను. నేను చేసిన హౌసింగ్‌ అభివృద్ధి చూసి వైఎస్‌ జగన్‌ నిన్ను ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు. అందుకే నాకు గృహనిర్మాణ శాఖ ఇచ్చారని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి నవరత్నాలలో ఇచ్చిన హామీలన్నింటినీ తప్పకుండా పాటిస్తామ’ని వెల్లడించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top