వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా శ్రావణి

Kolagatla Sravani as YSRCP State General secretary - Sakshi

విజయనగరం మున్సిపాలిటీ: వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా  కోలగట్ల శ్రావణి నియమితులయ్యారు.  పార్టీ జాతీయ అధ్యక్షుడు వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం గురువారం నియామక ఉత్తర్వులు  జారీ చేసింది. తనకు పదవి లభించడంపై పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి శ్రావణి గురువారం ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో మహిళా విభాగాన్ని పటిష్టం చేస్తానన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా మహిళా విభాగం కృషి చేస్తుందన్నారు. అలాగే, రాష్ట్ర మైనార్టీ సెల్‌ కార్యదర్శిగా పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన షేక్‌ షఫీని నియమించారు.

ఇదే పార్వతీపురం నియోజకవర్గంలో పట్టణ మైనార్టీ సెల్‌ అధ్యక్షునిగా షేక్‌ జలాల్‌కు బాధ్యతలు అప్పగించారు. సాలూరు నియోజకవర్గంలో సాలూరు పట్టణ రైతువిభాగం అధ్యక్షుడిగా కె.రమేష్‌ను, రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా పప్పల లక్ష్మణ, బంటు కన్నంనాయుడులను నియమించగా, కార్యదర్శులుగా బోను అప్పలస్వామి, వసంతల తిరుపతిలు నియమితులయ్యారు. అలాగే, రైతు విభాగం సంయుక్త కార్యదర్శులుగా కొట్యాడ సీతారాం, గనివాడ గోవిందులను నియమించగా, సాలూరు పట్టణ బీసీ సెల్‌ అధ్యక్షునిగా కొల్లి వెంకటరమణ, ప్రధాన కార్యదర్శులుగా బోను మహంతి శ్రీనివాసరావు, తాడ్డి శంకరరావులు, కార్యదర్శులుగా కంచుపల్లి వెంకటరావు, ఆరంగి అక్కయ్యలను సంయుక్త కార్యదర్శులుగా పెనుగంటి మోహనరావు, పాచిపెంట నాగరాజులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top